Giddalur: మంత్రి నారాయణను కలిసిన గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి!
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధి పనులు, తాగునీటి సమస్య పరిష్కారంపై మున్సిపల్ శాఖ మంత్రి పొంగుూరు నారాయణను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి కలిశారు.
Giddalur: మంత్రి నారాయణను కలిసిన గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి!
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ని గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులు, మున్సిపల్ పరిధిలోని మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై మంత్రితో చర్చించారు.
అలాగే గిద్దలూరు పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారం కోసం ట్యాంకర్ ల ద్వారా నీటి సరఫరా చేయుటకు , మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన పనులపై కూడా తగిన నిధులు మంజూరు చేయవలసినదిగా మంత్రి నారాయణ గారితో ఎమ్మెల్యే చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన అంశాలపై సానుకూలంగా స్పందించి సహకరించాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు.




