Naguluppalapadu: చీర్వానుప్పలపాడులో కాలువల పూడికతీత ప్రారంభం

Naguluppalapadu: నాగులుప్పలపాడు మండలం 'జలధార - జలహారతి' పనులు. జేసీబీతో పంట కాలువల పూడికతీతను ప్రారంభించిన ఎస్.ఎన్.పాడు ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్, కలెక్టర్ పి. రాజాబాబు.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 4 Jun 2026 3:45 PM IST
Naguluppalapadu
X

Naguluppalapadu: చీర్వానుప్పలపాడులో కాలువల పూడికతీత ప్రారంభం

నాగులుప్పలపాడు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జల దార - జల హారతి కార్యక్రమంలో భాగంగా నాగులుప్పలపాడు మండలం చీర్వానుప్పలపాడు గ్రామంలో వ్యవసాయానికి అవసరమైన నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు పంట కాలువల మరమ్మతు పనులను ప్రారంభించిన

సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు గౌ.శ్రీ.బి. ఎన్. విజయ్ కుమార్, మరియు జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కాలువల్లో పేరుకుపోయిన పూడిక తొలగింపు, గట్లు బలోపేతం, నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉన్న అడ్డంకుల తొలగింపు వంటి పనులు నిర్వహిస్తున్నారు.

ఈ పనుల ద్వారా సాగునీరు చివరి ఆయకట్టు వరకు చేరి రైతులకు ప్రయోజనం చేకూరనుంది. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాలువల పునరుద్ధరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. దీంతో వ్యవసాయ ఉత్పాదకత పెరగడంతో పాటు రైతుల ఆదాయం మెరుగుపడే అవకాశం ఉంది అని ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు అన్నారు.

ఈ కార్యక్రమంలో డ్వామా PD జోసెఫ్ గారు,ఇరిగేషన్ SE వరలక్ష్మి గారు,చంద్రశేఖర్ నాయుడు గారు, mro ప్రవీణ్ గారు, ఎంపీడీఓ సురేష్ గారు,డ్వామా APDరవి కుమార్ గారు,ఏపీవో రవి గారు, మండల పార్టీ అధ్యక్షులు తెళ్ళ మనోజ్ కుమార్ గారు,ఆళ్ల నాగార్జున గారు, గ్రామ పార్టీ అధ్యక్షులు ఆళ్ల సాంబశివరావు గారు, మాజీ సర్పంచ్ మురళి గారు,క్లస్టర్ ఇంచార్జి ఈదర నాని గారు,కో-క్లస్టర్ ఈదర రాజా గారు,పోలవరపు శ్రీకాంత్ గారు, పరిటాల రఘు గారు,మరియు అధికారులు,మండల,గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam

Next Story