Chirala: పూనూరు నూతలపాడులో 'ఇంటింటికి తెలుగుదేశం' పాల్గొన్న ఎమ్మెల్యే ఏలూరి

Chirala: పూనూరు, నూతలపాడులో 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 16 Aug 2026 9:27 AM IST
Chirala
X

Chirala: పూనూరు నూతలపాడులో 'ఇంటింటికి తెలుగుదేశం' పాల్గొన్న ఎమ్మెల్యే ఏలూరి

Chirala: పూనూరు, నూతలపాడులో ఇంటింటికి తెలుగుదేశం పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సర్వతోముఖాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.ఇంటింటికీ తిరిగిన ఎమ్మెల్యే ప్రభుత్వ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను పంచిపెట్టి, ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story