Markapuram: మాజీ సైనికులకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కీలక హామీ!

Markapuram: మార్కాపురం పట్టణంలో 27వ కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 26 July 2026 3:24 PM IST
Markapuram
X

Markapuram: మాజీ సైనికులకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కీలక హామీ!

మార్కాపురం: మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద 27వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఇమ్మడి కాశీనాథ్తో కలిసి కార్గిల్ అమరవీరులకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించి వారి త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ, ఇప్పటివరకు జిల్లా సైనికుల వెల్ఫేర్ భవనం ఒంగోలులో ఉండేదని, త్వరలోనే మార్కాపురం జిల్లాకు సంబంధించిన సైనికుల వెల్ఫేర్ భవనాన్ని కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల త్యాగం చిరస్మరణీయమని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

జనసేన మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ, కార్గిల్ అమరవీరుల త్యాగస్ఫూర్తి ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని, దేశభక్తిని భావితరాలకు చాటిచెప్పే ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ రాంబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ సైనికులు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story