Markapuram: వెలిగొండ నీటి విడుదలతో ప్రాంత రూపురేఖలు మారుతాయి: కందుల!

Markapuram: వెలిగొండ ప్రాజెక్టు నీటి విడుదలతో పశ్చిమ ప్రకాశం ప్రాంత రూపురేఖలు మారనున్నాయని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రెస్‌మీట్‌లో స్పష్టం చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 1 Sept 2026 10:09 PM IST
Markapuram
X

Markapuram: వెలిగొండ నీటి విడుదలతో ప్రాంత రూపురేఖలు మారుతాయి: కందుల!

మార్కాపురం: ఇచ్చిన మాటకు కట్టుబడి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు విడుదల చేశామని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మార్కాపురం జవహర్‌నగర్‌లోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రాంత ప్రజల పాలిట దైవమన్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వేలాది మంది తరలివచ్చి ఆనందభాష్పాలతో వేడుకను తిలకించారని తెలిపారు.

23 లక్షల మందికి తాగునీరు అందించే వెలిగొండ ప్రాజెక్టు కోసం ఏడు గ్రామాల నిర్వాసితులు చేసిన త్యాగాలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వారి త్యాగాలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలని కోరారు. నీటి విడుదలతో త్వరలోనే ఈ ప్రాంత రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ వినుకొండ నియోజకవర్గ పరిశీలకులు వక్కలగడ్డ మల్లికార్జున, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, జిల్లా టిడిపి నాయకులు తాళ్లపల్లి సత్యనారాయణ మరియు నాయకులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story