Chirala: చీరాలలో అంగరంగ వైభవంగా విజయదశమి 'పారువేట' ఉత్సవం!

Chirala: విజయదశమి ముగింపు సందర్భంగా చీరాల ఎన్ఆర్పీఎమ్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో పారువేట ఉత్సవం ఘనంగా జరిగింది.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 21 Oct 2026 6:20 AM IST
Chirala
X

Chirala: చీరాలలో అంగరంగ వైభవంగా విజయదశమి 'పారువేట' ఉత్సవం!

Chirala: విజయదశమి సందర్భంగా చీరాల లో నూనె రంగనాయకులు అండ్ పానకాలు మున్సిపల్ హై స్కూల్ వద్ద పారువేట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య మరియు చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్.

దసరా వేడుకల ముగింపు సూచకంగా ఆనవాయితీగా వచ్చే పారువేట కార్యక్రమం చీరాలలోని ఎన్ఆర్పిఎం హైస్కూల్లో ఘనంగా జరిగింది. గుళ్ళలో పూజలు అందుకున్న స్వామివార్లు అమ్మవార్లు మంగళవారం రాత్రి వాహ్యాలిగా ఈ స్కూల్ మైదానానికి చేరుకొని పూజలు అందుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వారిని దర్శించుకుని కృపాకటాక్షాలు పొందారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala