Giddalur: గిద్దలూరులో మెరిటోరియస్ విద్యార్థులకు సన్మానం

Giddalur: 10వ తరగతిలో 550కి పైగా మార్కులు సాధించిన వారికి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారాలు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 31 May 2026 2:49 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరులో మెరిటోరియస్ విద్యార్థులకు సన్మానం

గిద్దలూరు: నియోజకవర్గoలోని శ్రీ క్రిష్ణ దేవరాయ బలిజ సేవా సంఘం భవనంలో 10 వ తరగతి లో 550 కి పైగా మార్కులు సాధించిన కాపు విద్యార్థిని విద్యార్థులకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి చేతుల మీదుగా శాలువా, పురస్కారంతో ఘనంగా సన్మానించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బలిజ సేవా సంఘంలోని సోదర సోదరీమణులందరికీ సంఘంలో కానీ స్వయంగా కానీ అభివృద్ధి కొరకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా స్వయంగా నన్ను సంప్రదించాలని మీకు అన్ని విధాలుగా తోడుంటానని తెలిపారు.

అనంతరం కాపు సంఘం అధ్యక్షుడు, నాయకులు ఎమ్మెల్యే కు దేవుని ప్రతిమ అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు కాపు సంఘం అధ్యక్షుడు కమతం శ్రీనివాసులు, కాపు సంఘం నేతలు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU

Next Story