Giddalur: గొర్రెల కాపరులకు గుడ్ న్యూస్.. గిద్దలూరులోనే సొంత సంత!

Giddalur: గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మార్కెట్ యార్డులో గొర్రెల సంతను ప్రారంభించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 13 May 2026 11:03 AM IST
Giddalur
X

Giddalur: గొర్రెల కాపరులకు గుడ్ న్యూస్.. గిద్దలూరులోనే సొంత సంత!

గిద్దలూరు: గొర్రెల కాపరులకు మేలు చేసేందుకే గొర్రెల సంత ప్రారంభించినట్లు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. బుధవారం మార్కెట్ యాడ్ ఆవరణలో నిర్వహించిన గొర్రెల సంతను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రతి శుక్రవారం గిద్దలూరు మార్కెట్ యాడ్ ఆవరణలో పశువుల సంత ఇప్పటికే నిర్వహిస్తున్నామని ఇప్పుడు ప్రతి బుధవారం మేకలు, గొర్రెల సంత నిర్వహించేందుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. గొర్రెల కాపర్లు సంత కోసం మార్కాపురం ప్రాంతానికి వెళ్లవలసిన పరిస్థితి గతంలో ఉండేదని.

వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గిద్దలూరులో కూడా ప్రతి బుధవారం సంత నిర్వహిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ సంతను గిద్దలూరు నియోజకవర్గంలోని గొర్రెల కాపరులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి సంతకు వచ్చే రైతులకు భోజన వసతి పాటు అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU

Next Story