Giddalur: బేస్తవారిపేటలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అశోక్ రెడ్డి!

Giddalur: బేస్తవారిపేటలో రక్తదాన శిబిరాన్ని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు,90 మందికి పైగా రక్తదానం చేసినట్లు వెల్లడించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 9 Aug 2026 4:39 PM IST
Giddalur
X

Giddalur: బేస్తవారిపేటలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అశోక్ రెడ్డి!

Giddalur: గిద్దలూరు నియోజకవర్గం బేస్తవారిపేట పట్టణంలోని న్యూ స్వప్న హోటల్ వారి ఆధ్వర్యంలో సత్వేలి క్రిష్ణయ్య యాదవ్ కుమారుడు శివకృష్ణ , రక్తదాన శిబిరాన్ని యశ్వంత్ ప్రైవేట్ పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంబించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి రక్తదాన శిబిరాన్ని పరిశీలించి రక్తదానం చేసిన రక్తదాతలను పలకరించి వారికి స్వయంగా కూల్ డ్రింక్ తాపీ అభినందించారు. అత్యవసర సమయాల్లో రక్తం అందక అనేకమంది ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇటువంటి రక్తదాన శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

రక్తదానం చేయడం ద్వారా ఒకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుందని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సమాజ సేవలో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన న్యూ స్వప్న హోటల్ ప్రొప్రైటర్ సత్వేలి క్రిష్ణయ్య యాదవ్ ను వారి కుమారుడిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ శిబిరంలో పేర్లు నమోదు చేసుకుని 90 మందికి పైగా రక్తదానం చేయడం జరిగింది.

మార్కాపురం, కంభం, గిద్దలూరు పరిధిలోనీ జాతీయ రహదారిపై ఎన్నో ప్రమాదాలు జరిగి తీవ్ర గాయాలతో రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రులకు చేరి రక్తం అందక ప్రాణాలు వదిలిన సంఘటనలు ఉన్నాయి దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రక్తదాన శిబిరాన్ని న్యూ స్వప్న హోటల్ అధినేత కృష్ణయ్య ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, బేస్తవారిపేట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU

Next Story