Yerragondapalem: ప్రగల్లపాడులో ఓటరు జాబితా సవరణ సదస్సు!
Yerragondapalem: పెద్దారవీడు మండలం ప్రగల్లపాడులో ఓటరు జాబితా సవరణ అవగాహన సదస్సులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Yerragondapalem: ప్రగల్లపాడులో ఓటరు జాబితా సవరణ సదస్సు!
యర్రగొండపాలెం: యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పెద్దారవీడు మండలం ప్రగల్లపాడు గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) అవగాహన కార్యక్రమంలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని తమ పేరు, చిరునామా, ఇతర వివరాలను సరిచూసుకుని అవసరమైన మార్పులు చేయించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు ఎస్‌ఐఆర్ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్న ఆయన, ప్రజల భాగస్వామ్యంతోనే పారదర్శకమైన ఎన్నికల వ్యవస్థ బలోపేతం అవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, మండల స్థాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




