Podili: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిరసన!
Podili: పొదిలి నగర పంచాయతీ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు పెద్దఎత్తున నిరసన తెలిపారు.
Podili: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిరసన!
Podili: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి, నగర పంచాయతీ మున్సిపల్ కార్మికుల సంఘం అధ్యక్షుడు బండి కోటేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు డీఏ, మధ్యంతర భృతి (ఐఆర్) చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల వేతనాలను పెంచి వారి ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు.
నగర పంచాయతీ, వైద్య ఆరోగ్యశాఖలోని హెల్త్ మిషన్ తదితర ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న ఆప్కాస్, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎంటీఎస్ అమలు చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖలు, షెడ్యూల్‌డ్ ఎంప్లాయ్‌మెంట్ పరిశ్రమల్లో పనిచేస్తున్న లక్షలాది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించేలా ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు నాగేంద్రమ్మ, అంజమ్మ, పోలేరమ్మ, లింగమ్మ, స్వరూప, లీల, చిన్నక్క, ప్రభావతి, రాజమ్మ, సుబ్బారావు, అంకిత్, ఏడుకొండలు తదితరులు, కార్మికులు పాల్గొన్నారు.




