Ongole: ఒంగోలు ఎన్డీఏ మేయర్ అభ్యర్థి శ్రీశిల్పకు బీ-ఫామ్ అందజేత!

Ongole: ఒంగోలు నగర మేయర్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్పకు బీ-ఫామ్ అందజేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. సమన్వయంతో పనిచేయాలని పిలుపు.

Showry Doas, Staff Reporter -Ongole
Published on: 20 Oct 2026 3:42 PM IST
Ongole
X

Ongole: ఒంగోలు ఎన్డీఏ మేయర్ అభ్యర్థి శ్రీశిల్పకు బీ-ఫామ్ అందజేత!

ఒంగోలు: ఒంగోలు నగర మేయర్ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్న నల్లమల్లి శ్రీశిల్పకు తెలుగుదేశం పార్టీ బి-ఫామ్‌ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అందజేశారు. మంగళవారం టీడీపీ ముఖ్య నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ, ఒంగోలు నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగి మేయర్ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్పను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు.

కూటమి పార్టీల మధ్య సమన్వయం, నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితో ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఒంగోలు నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని దామచర్ల జనార్దన్ రావు సూచించారు.

Showry Doas, Staff Reporter -Ongole

Showry Doas, Staff Reporter -Ongole

రెండు దశాబ్దాలకు చేరువగా (16 ఏళ్లు) క్షేత్రస్థాయి అనుభవంతో, ఒంగోలు మరియు ప్రకాశం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.