Pedda Dornala: పెద్ద దోర్నాల వద్ద తృటిలో తప్పిన భారీ రోడ్డు ప్రమాదం!
Pedda Dornala: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలంలోని శ్రీశైలం రహదారి మూలమలుపు వద్ద తుఫాన్ వాహనం, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
Pedda Dornala: పెద్ద దోర్నాల వద్ద తృటిలో తప్పిన భారీ రోడ్డు ప్రమాదం!
Pedda Dornala: పెద్ద దోర్నాల మండలంలోని శ్రీశైలం రహదారిపై పెద్ద మూల మలుపు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం నుంచి పెద్ద దోర్నాల వైపు వస్తున్న తుఫాన్ వాహనం, పెద్ద దోర్నాల నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో పాటు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, ఢీకొన్న ఘటనలో రెండు వాహనాల ముందు భాగాలు తీవ్రంగా దెబ్బతిని నుజ్జునుజ్జయ్యాయి.
సమాచారం అందుకున్న పెద్ద దోర్నాల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాద పరిస్థితులను సమీక్షించారు.




