Markapur: మార్కాపురం జిల్లా వేములకోటలో నూతన జెడ్పీ కార్యాలయం ప్రారంభం!

Markapur: మార్కాపురం జిల్లా వేములకోటలో నూతన జెడ్పీ కార్యాలయం ప్రారంభమైంది. జిల్లా ప్రత్యేక అధికారిగా కలెక్టర్ ఎం. విజయసునీత బాధ్యతలు స్వీకరించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 25 Sept 2026 11:04 AM IST
Markapur
X

Markapur: మార్కాపురం జిల్లా వేములకోటలో నూతన జెడ్పీ కార్యాలయం ప్రారంభం!

Markapur: మార్కాపురం జిల్లా వేములకోటలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 12:15 గంటలకు శుభ ముహూర్తంలో జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ఎం. విజయసునీత చేతుల మీదుగా కార్యాలయం ప్రారంభం కానుంది. నూతన జెడ్పీ కార్యాలయానికి ప్రత్యేకాధికారిగా కలెక్టర్ ఎం. విజయసునీత బాధ్యతలు స్వీకరించనున్నారు.

జిల్లా సమగ్ర అభివృద్ధి, పాలనా సౌలభ్యం, ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించడమే లక్ష్యంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు జెడ్పీ సీఈఓ బి. చిరంజీవి తెలిపారు. ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, స్థానిక ప్రముఖులు, ప్రజలు హాజరుకానున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM