Ongole: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లక్ష్యంగా ఒంగోలులో చెత్త విభజన డ్రైవ్!
Ongole: ఒంగోలు మున్సిపాలిటీ 150 ఏళ్ల వేడుకల సందర్భంగా సెప్టెంబర్ 19న చేపట్టే మెగా సెగ్రిగేషన్ డ్రైవ్‌కు 18న ట్రయల్ రన్ నిర్వహించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు.
Ongole: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లక్ష్యంగా ఒంగోలులో చెత్త విభజన డ్రైవ్!
ఒంగోలు, సెప్టెంబర్ 16: ఒంగోలు మున్సిపాలిటీ 150 ఏళ్ల వేడుకలను పురస్కరించుకుని ఈనెల 19న నిర్వహించనున్న ‘మెగా సెగ్రిగేషన్ డ్రైవ్’కు శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో నమోదయ్యేలా ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సూచించారు.
మున్సిపాలిటీ పరిధిలోని 80 వేలకు పైగా ఇళ్లకు గురువారం ప్రత్యేక నంబర్లతో కూడిన రెండు బయోడీగ్రేడబుల్ కవర్లను పంపిణీ చేయనున్నారు. తడి, పొడి చెత్తను ఇంటి వద్దే వేర్వేరుగా సేకరించేలా ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. డ్రైవ్ లక్ష్యాలు, చెత్త విభజన ఆవశ్యకత, మున్సిపాలిటీ 150 ఏళ్ల వేడుకల వివరాలతో కూడిన కరపత్రాలను కూడా పంపిణీ చేయనున్నారు.
శనివారం ఉదయం గంటపాటు జరిగే డ్రైవ్‌లో మున్సిపల్ సిబ్బందికి సహాయంగా మెప్మా సభ్యులను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఒంగోలు పారిశుధ్య కార్మికులతో పాటు సమీప మండలాల పంచాయతీ సిబ్బందిని కూడా విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. చెత్త తరలింపు వాహనాలు, సిబ్బంది కేటాయింపు, శానిటేషన్ డివిజన్ల వారీగా పర్యవేక్షణకు జిల్లా స్థాయి అధికారులను నియమించనున్నట్లు తెలిపారు.
విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించేలా గురువారం అన్ని పాఠశాలలు, కళాశాలల్లో కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
ప్రకాశం భవన్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జడ్పీ సీఈవో చిరంజీవి, మెప్మా పీడీ నారాయణ, డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ జోసఫ్‌కుమార్, పశుసంవర్ధక శాఖ డీడీ రవికుమార్, డీఈవో రేణుక, మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణయ్య, అసిస్టెంట్ కమిషనర్ నగేష్, హెల్త్ ఆఫీసర్ వైష్ణవి, శానిటరీ సూపర్‌వైజర్ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.




