Ongole: ఒంగోలు డిప్యూటీ మేయర్‌గా చావలి చార్పిత ఎన్నిక

Ongole: ఒంగోలు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా చావలి చార్పిత ఎన్నిక; 62 మంది కార్పొరేటర్లతో ప్రమాణం చేయించిన కలెక్టర్ రాజాబాబు, ఎంపీ మాగుంట హాజరు.

Showry Doas, Staff Reporter -Ongole
Published on: 23 Nov 2026 4:59 PM IST
Ongole
X

Ongole: ఒంగోలు డిప్యూటీ మేయర్‌గా చావలి చార్పిత ఎన్నిక

ఒంగోలు: ఒంగోలు నగరపాలక సంస్థ నూతన పాలకవర్గం కొలువుదీరింది. సోమవారం (నవంబర్ 23) ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు హాజరై, నూతనంగా ఎన్నికైన 62 మంది కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్‌లో డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో చావలి చార్పిత డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. దీంతో ఆమెను డిప్యూటీ మేయర్‌గా కలెక్టర్ ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ నల్లమల్లి శ్రీశిల్ప, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు నూతనంగా ఎన్నికైన నగరపాలక సంస్థ పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. నగర అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు.

Showry Doas, Staff Reporter -Ongole

Showry Doas, Staff Reporter -Ongole

రెండు దశాబ్దాలకు చేరువగా (16 ఏళ్లు) క్షేత్రస్థాయి అనుభవంతో, ఒంగోలు మరియు ప్రకాశం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.