ongole: తహసీల్దార్ పిన్నిక మధుసూదన్‌కు డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి!

ongole: మార్కాపురం వాసి, ప్రస్తుతం ఒంగోలు తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న పిన్నిక మధుసూదన్‌కు రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి కల్పించింది.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 26 May 2026 3:49 PM IST
ongole
X

ongole: తహసీల్దార్ పిన్నిక మధుసూదన్‌కు డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి!

ఒంగోలు: మార్కాపురం జిల్లా వాసి, ప్రస్తుతం ఒంగోలు తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న పిన్నిక మధుసూదన్‌కు రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర రెవిన్యూ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పిన్నిక మధుసూదన్ గతంలో కొమరోలు, పెద్దారవీడు, బల్లికురవ, సంతనూతలపాడు, చీమకుర్తి మండలాల్లో తహసీల్దార్‌గా పనిచేసి ప్రజలకు చేరువైన అధికారిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఒంగోలు తహసీల్దార్‌గా కొనసాగుతూ రెవిన్యూ సమస్యలను వేగంగా పరిష్కరిస్తూ ప్రజాభిమానాన్ని సంపాదించారు.

విశేషమేమిటంటే, గతంలో రెండు సార్లు డిప్యూటీ కలెక్టర్ పదోన్నతి వచ్చినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించి తహసీల్దార్‌గానే సేవలు కొనసాగించారు. అయితే మూడోసారి వచ్చిన పదోన్నతిని స్వీకరించి త్వరలో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. విధి నిర్వహణలో క్రమశిక్షణ, పారదర్శకతతో పనిచేసినందుకు పిన్నిక మధుసూదన్‌కు పలుమార్లు ప్రభుత్వ ఉన్నతాధికారుల ప్రశంసలు లభించాయి. ఇక బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పి.ఎల్.పి. యాదవ్‌కు ఆయన సోదరుడు కావడం విశేషం.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story