Markapuram: తర్లుపాడు పోలీస్ స్టేషన్‌లో ఓఎస్డీ మిశ్రా ఆకస్మిక తనిఖీ!
Markapuram: మార్కాపురం జిల్లా ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా ఐపీఎస్ తర్లుపాడు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Markapuram: తర్లుపాడు పోలీస్ స్టేషన్‌లో ఓఎస్డీ మిశ్రా ఆకస్మిక తనిఖీ!
మార్కాపురం: మార్కాపురం జిల్లా ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా శనివారం తర్లుపాడు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పోలీస్ స్టేషన్‌లో ప్రజలకు అందుతున్న సేవలు, ఫిర్యాదుల స్వీకరణ విధానం, స్పందన తీరు, సిబ్బంది పనితీరు, పరిశుభ్రత, నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు. ప్రజల సమస్యలపై వెంటనే స్పందిస్తూ పారదర్శకంగా విధులు నిర్వహించాలని పోలీసు అధికారులకు సూచించినట్లు సమాచారం.
చట్టం-శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
Next Story




