Chadalavada: చదలవాడ చిన్నారి హత్యాచార ఘటనపై ఉద్రిక్తత!

Chadalavada: నాగులుప్పలపాడు మండలం చదలవాడలో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటనపై ఆగ్రహావేశాలు.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 26 Oct 2026 1:48 PM IST
Chadalavada
X

Chadalavada: చదలవాడ చిన్నారి హత్యాచార ఘటనపై ఉద్రిక్తత!

Chadalavada: నాగులుప్పలపాడు మండలం చదలవాడలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆరోపణలు రావడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. అభం శుభం తెలియని పసిపాపకు జరిగిన దారుణంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారికి న్యాయం చేయాలని, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యులు ఉదయం నుంచి చదలవాడ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

నిందితుడికి కఠిన శిక్ష పడే వరకు ఆందోళన విరమించేది లేదంటూ గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే బీఎన్‌ విజయ్ కుమార్ ఘటనా స్థలం నుంచే జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఘటనపై మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు సమాచారం.

అనంతరం ఆందోళన చేస్తున్న గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడారు. చిన్నారికి జరిగిన అన్యాయంపై న్యాయం జరిగేలా చూస్తానని, నిందితుడికి చట్టప్రకారం కఠిన శిక్ష పడేందుకు తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

అయినప్పటికీ, చిన్నారికి జరిగిన దారుణంపై గ్రామంలో ఆగ్రహావేశాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం కీలకంగా మారింది.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam