Pedda Dornala: పెద్ద దోర్నాలలో వైభవంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!
Pedda Dornala: పెద్ద దోర్నాల మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 80వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. తహసీల్దార్ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన అశోక్‌రెడ్డి.
Pedda Dornala: పెద్ద దోర్నాలలో వైభవంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!
Pedda Dornala: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. వివిధ కార్యాలయాలను జాతీయ జెండాలతో అలంకరించి స్వాతంత్ర్య దినోత్సవాన్ని వైభవంగా జరుపుకున్నారు.
మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సిహెచ్. అశోక్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ స్వాతంత్ర్యం కోసం వారు చేసిన పోరాటాన్ని కొనియాడారు.
అటవీశాఖ కార్యాలయంలో అటవీశాఖ అధికారి జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై రమణయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. మండల అభివృద్ధి కార్యాలయంతో పాటు మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది జాతీయ జెండాలను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పలు ప్రైవేటు కార్యాలయాల్లోనూ జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




