Pedda Dornala: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పటిష్ట భద్రత పెద్ద దోర్నాల ఎస్సై!

Pedda Dornala: పెద్ద దోర్నాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Srikanth Singam, Markapur
Published on: 16 Oct 2026 10:59 PM IST
Pedda Dornala
X

Pedda Dornala: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పటిష్ట భద్రత పెద్ద దోర్నాల ఎస్సై!

పెద్ద దోర్నాల: మార్కాపురం జిల్లాపెద్ద దోర్నాల రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు పెద్ద దోర్నాల ఎస్సై జె. నాగరాజు తెలిపారు. పెద్ద దోర్నాల పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే రాజకీయ పార్టీలకు చెందిన సమస్యాత్మక వ్యక్తులు, రౌడీషీటర్లపై బైండోవర్ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు.

రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, కార్యకర్తలు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఎస్సై సూచించారు. ఎన్నికల సమయంలో ఆధిపత్య ప్రదర్శనలు, ఘర్షణలు, బెదిరింపులు, గొడవలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణాన్ని కల్పించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడినా వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేస్తామని ఎస్సై నాగరాజు హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur