Peddaraveedu: ఎస్. కొత్తపల్లిలో నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు!

Peddaraveedu: పెద్దారవీడు మండలం ఎస్. కొత్తపల్లి గ్రామంలోని నాగుల పుట్ట వద్ద నాగుల చవితి సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆలయ ధర్మకర్త తిరుమలరెడ్డి ఆంజనేయ రెడ్డి తెలిపారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 13 Nov 2026 4:14 PM IST
Peddaraveedu
X

Peddaraveedu: ఎస్. కొత్తపల్లిలో నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు!

పెద్దారవీడు: నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం పెద్దారవీడు మండలం ఎస్. కొత్తపల్లి గ్రామంలోని నాగుల పుట్ట వద్ద వీరనాగ, అభయాంజనేయ స్వామి, తులసీమాత, శ్రీ వెంకటేశ్వర స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త తిరుమలరెడ్డి ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ.. నాగుల చవితి శుభ సందర్భంగా ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని, గ్రామ ప్రజలతో పాటు యావత్ ప్రజానీకం సుఖశాంతులతో, సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తిరుమలరెడ్డి ఆంజనేయ రెడ్డి తెలిపారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM