Markapuram: పెద్దారవీడులో ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర’ సంబరాలు

Markapuram: ప్రకాశం జిల్లా పెద్దారవీడు గ్రామంలో "స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర" కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 17 Jun 2026 12:04 PM IST
Markapuram
X

Markapuram: పెద్దారవీడులో ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర’ సంబరాలు

Markapuram: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలంలోని పెద్దారవీడు గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎంపీడీవో జాన్ సుందరం, మాజీ టీడీపీ మండల అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామంలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు పరిశుభ్రమైన పరిసరాల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఎంపీడీవో జాన్ సుందరం మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను తమ నిత్యజీవితంలో భాగంగా చేసుకుని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు.

మాజీ టీడీపీ మండల అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధి, పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలు చురుకుగా పాల్గొనాలని కోరారు.

ఈ కార్యక్రమంలో స్వర్ణగ్రామం సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు మరియు పెద్దారవీడు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story