Peddaraveedu: 10 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ఏర్పాట్లు పూర్తి

Peddaraveedu: పెద్దారవీడు మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ సిద్ధం. పుచ్చకాయపల్లి ఏకగ్రీవం. భద్రత నడుమ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది రవాణా.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 4 Nov 2026 5:36 PM IST
Peddaraveedu
X

Peddaraveedu: 10 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ఏర్పాట్లు పూర్తి

పెద్దారవీడు: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలంలోని మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలకు గాను పుచ్చకాయపల్లి ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవం కావడంతో మిగిలిన 10 స్థానాలకు రేపు ఎన్నికలు నిర్వహించనున్నట్లు రిటర్నింగ్ అధికారి (ఆర్వో) రమేష్ కుమార్ తెలిపారు.

ఎన్నికల నిర్వహణలో భాగంగా పెద్దారవీడు ఎంపీడీవో కార్యాలయంలో ఆర్వో రమేష్ కుమార్, తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీవో జాన్ సుందరం సిబ్బందికి ఎన్నికల సామగ్రిని అందజేసి, పోలింగ్ విధులపై తగిన సూచనలు చేశారు. అనంతరం సీఐ మాతంగి శ్రీనివాసులు పర్యవేక్షణలో ఎస్సై సైదుబాబు ఆధ్వర్యంలో పోలీస్ భద్రత మధ్య ఎన్నికల సిబ్బందిని సామగ్రితో సహా ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించారు.

ఈ సందర్భంగా సీఐ మాతంగి శ్రీనివాసులు మాట్లాడుతూ.. మండలంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్సైలు, 50 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపట్టిందని రేయ్ సీఐ మాతంగి శ్రీనివాసులు తెలిపారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM