Giddalur: గిద్దలూరు లో రైతు సంఘల సమైక్య సమావేశం

Giddalur: మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్ రెడ్డి అడుగుజాడల్లో పంటల గిట్టుబాటు ధరలపై పోరాటానికి పిలుపునిచ్చిన తనయుడు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 2 Jun 2026 4:18 PM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరు లో రైతు సంఘల సమైక్య సమావేశం

గిద్దలూరు: పట్టణంలోని తిరుమల కన్వర్షన్ హాల్ లో ఈనెల 3వ తేదీన రైతు సంఘల సమైక్య సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్ రెడ్డి గతంలో రైతులకు మేలు చేయాలని రైతు సంఘాల సమైక్యను స్థాపించారు .ఆయన అడుగుజాడల్లో నడుస్తూ తనయుడు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈ రైతు సంఘల సమైక్యలను ముందుకు తీసుకు వెళ్ళేందుకు కృత నిశ్చయంతో పనిచేస్తున్నారు.

అందులో భాగంగా రైతు సమస్యలపై పంటల గిట్టుబాటు ధరలపై చర్చించేందుకు గిద్దలూరు నియోజకవర్గ రైతులు ఈ సమావేశానికి తరలిరావాలని ప్రవీణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు .ముఖ్యంగా మొక్కజొన్న, పొగాకు, పత్తి తదితర పంటల సమస్యలపై చర్చించేందుకు రైతులు ముందుకు రావాలని ప్రవీణ్ కుమార్ రెడ్డి కోరారు.ఈ కార్యక్రమాన్ని రైతులందరూ విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU

Next Story