Podili: గుక్కెడు నీటి కోసం ‘కంబలపాడు’ రణరంగం స్టేట్ హైవేపై రాస్తారోకో!
Podili: పొదిలి మండలం కంబలపాడులో ఆరు నెలలుగా తాగునీటి సమస్య. ఖాళీ బిందెలతో ఒంగోలు-కర్నూలు రాష్ట్ర రహదారిపై గ్రామస్థుల భారీ ధర్నా, స్తంభించిన ట్రాఫిక్.
Podili: గుక్కెడు నీటి కోసం ‘కంబలపాడు’ రణరంగం స్టేట్ హైవేపై రాస్తారోకో!
Podili: మార్కాపురం జిల్లా పొదిలి మండలం కంబలపాడు లో ఆరు నెలలుగా గుక్కెడు మంచి నీటి కోసం అల్లాడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మార్కాపురం నియోజకవర్గం కంబలపాడు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ గ్రామానికి చెందిన మహిళలు, పురుషులు ఖాళీ బిందెలతో ఒంగోలు - కర్నూలు రాష్ట్ర రహదారిపైకి చేరి పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో చేపట్టారు.
ప్రధాన రహదారిపై గ్రామస్తులు బైఠాయించడంతో ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు, ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. ఆరు నెలలుగా నీటి సమస్యపై అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోకపోవడంతోనే తాము రోడ్డు ఎక్కాల్సి వచ్చిందని ఈ సందర్భంగా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
రాస్తారోకో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడి, సమస్య తీవ్రతను తెలుసుకున్నారు. త్వరలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. పోలీసుల హామీతో సంతృప్తి చెందిన గ్రామస్తులు తమ ధర్నాను విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, వాహనాల రాకపోకలను యథావిధిగా పునరుద్ధరించారు.




