Podili: నిర్లక్ష్యనికి నిలువటద్దం... పొదిలి మున్సిపాలిటీ...
Podili: ప్రకాశం జిల్లా పొదిలి మున్సిపాలిటీ పరిధిలోని తాలూకాఫీసు వీధిలో గత 20 రోజులుగా తాగునీటి సమస్యపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Podili: నిర్లక్ష్యనికి నిలువటద్దం... పొదిలి మున్సిపాలిటీ...
పొదిలి: మార్కాపురంజిల్లా పొదిలి మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యపు పనితీరుకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. స్థానిక తాలుకాఫీసు వీదిలో డిప్ బొర్ పైపులు చిల్లులుపడి నీరు వృదాగా పొతుండటంతో సిబ్బంది ఆవీదికి నీటిని నిలుపుదల చేశారు. గత 20 రొజులుగా పడుతున్న నీటి ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి స్దానిక టిడిపి బుత్ కన్వినర్ కారంశెట్టి కిషొర్ తీసుకెళ్ళి ప్రజాదర్బర్ లో వెళ్ళడించారు.
తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే వెంటనే నీటి సమస్యను తీర్చాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలను పట్టించుకొని అధికారులు స్దానిక టిడిపి ప్రజాప్రతినిధి ముందుకొచ్చి మరమత్తుల ఖర్చుసైతం నేనే భరాయిస్తానని భరొసా ఇచ్చిన మున్సిపల్ సిబ్బంది స్పందించక పొవడం విచారకరమణి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 రొజులుగా డిప్ బొర్ పనిచేయక పొవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగొలు చేసి అవసరాలు తీర్చుకుంటున్నారు.
అటు సాగర్ నీరు రాక,ఇటు డిప్ బొర్ పనిచేయక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మొద్దనిద్ర వీడకపొతే ప్రభుత్వ యంత్రంగం అభాసుపాలైయ్యే ప్రమాదం దగ్గరలోనే ఉంది. అధికారులు స్పందించి తక్షణమే నీటి సమస్యను తొలగించాలని స్దానికులు కొరుతున్నారు.




