Podili: పొదిలిలో హైడ్రామా: ప్రయాణికులు తగ్గలేదు.. డ్రైవర్ దిగిపోయాడు!

Podili: పొదిలి-కొండేపి ఆర్‌టిసి బస్సులో భారీగా తోపులాట. ఫుట్‌బోర్డ్ ప్రయాణంతో ఆందోళన చెందిన డ్రైవర్ బస్సు ఆపేసి దిగిపోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

MADARVALI, MARKAPURAM
Published on: 7 July 2026 10:04 AM IST
Podili
X

Podili: పొదిలిలో హైడ్రామా: ప్రయాణికులు తగ్గలేదు.. డ్రైవర్ దిగిపోయాడు!

పొదిలి: మార్కాపురం జిల్లా పొదిలి ఆర్టిసి డిపొకు చెందిన బస్సు పొదిలి నుండి కొండేపికి వెళ్ళవలసి ఉండంగా స్దానిక పెద్ద బస్టాండ్ సెంటర్లో పెద్ద సంఖ్యలో మహిళలలు బస్సు ఎక్కేందుకు ప్రయత్నించారు.

అప్పటికే స్టాడింగ్ తో ఉన్న బస్సు ప్రయాణికులు పెద్ద ఎత్తున ఎక్కడంతో డ్రైవర్ ఆందోళన చెందాడు కనీసం మనిషి తప్పుకొనేతం ఖాళీ కుడా లేక పొవడం పుట్ బొర్డ్ ప్రయాణికులు వేలబడటంతో డ్రైవర్ బస్సు ఆపి నావల్ల కాదని టిషాప్ దగ్గర కుర్చున్నాడు.

దాదాపు అరగంట సేపు బస్సు ఆగిన ప్రయాణికులు బస్సు దిగడానికి ఇష్టపడకపొవడంతో పెద్ద బస్టాండ్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ కు చేత చెప్పించాడు ఆయన ప్రయాణికులలో కదలిక కనపడలేదు. చివరికి మహిళా కండక్టర్ సహయంతో బస్సులోకి ప్రయాణికులను కుక్కి పుట్ బొర్డ్ పై నిలబడకుండా ఉండాలని కొరాడు.

రహదారి పరిస్థితి బావులేదని అనుకొని సంఘటన ఏదైనా జరిగితే ఇబ్బంది తప్పదని హెచ్చరించిన ప్రయాణికులు తగ్గలేదు.

చివరకు చేసేదిమిలేక బస్సును నిదానంగా కదిలించాడు ఐదు గంటలకు బయలుదేరవలసిన బస్సు దాదాపు 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. ప్రయాణికులు భారి స్దాయిలో ఉన్న ఆర్టిసి అధికారులు ప్రత్యేక బస్సులు వేయక పొవడం విడ్డురం.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM

Next Story