Podili: పొదిలిలో ఉద్రిక్తత వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై దాడి!

Podili: మార్కాపురం జిల్లా పొదిలిలో ఉద్రిక్తత. నామినేషన్ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి దొనపాటి శ్రావణిపై దాడి, పత్రాలు చించివేత. రోడ్డుపై బైఠాయించిన నేతలు!

M. MITHRAM, ANANTAPURURAM
Published on: 21 Oct 2026 6:08 PM IST
Podili
X

Podili: పొదిలిలో ఉద్రిక్తత వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై దాడి!

Podili: మార్కాపురం జిల్లా పొదిలిలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది నామినేషన్ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై దాడి జరిగిందంటూ ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. పొదిలి మండలం సూదనగుంట వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి దొనపాటి శ్రావణి నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు.

నామినేషన్ కేంద్రం వద్ద తన చీర లాగి, నామినేషన్ పత్రాలను చించి బయటకు పంపించారని దొనపాటి శ్రావణి ఆరోపించినట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ ఘటనకు టీడీపీ కార్యకర్తలే కారణమంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఘటనను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. మార్కాపురం వైఎస్సార్‌సీపీ పరిశీలకులు కేవీ రమణారెడ్డి కూడా ధర్నాలో పాల్గొన్నారు. నామినేషన్ ప్రక్రియకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పొదిలిలో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. భారీగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీసులను డిమాండ్ చేశారు

M. MITHRAM, ANANTAPURURAM

M. MITHRAM, ANANTAPURURAM