Markapur: మార్కాపురం ఆర్టీసీ కార్గోలో విద్యుత్ కష్టాలు.. సేవల నిలిపివేత!

Markapur: మార్కాపురం ఆర్టీసీ కార్గో కార్యాలయంలో కరెంటు లేక నిలిచిన సేవలు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 25 April 2026 9:20 AM IST
Markapur
X

Markapur: మార్కాపురం ఆర్టీసీ కార్గోలో విద్యుత్ కష్టాలు.. సేవల నిలిపివేత!

Markapur: మార్కాపురం పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న ఆర్టీసీ కార్గో సర్వీస్‌లో శనివారం ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సేవలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పార్సిల్‌లు తీసుకోవడానికి వచ్చిన వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వినియోగదారులు మాట్లాడుతూ, కరెంటు లేకపోయినా కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పార్సిల్‌లను అందించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని, అయితే “మళ్లీ రండి” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్గో కార్యాలయంలో కనీస అవసరమైన యూపీఎస్ వ్యవస్థ కూడా లేకపోవడం వల్ల పూర్తిగా సేవలు నిలిచిపోయాయని తెలిపారు. గంటల తరబడి వేచి చూసినా సరైన స్పందన లేకపోవడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మార్కాపురం ఆర్టీసీ కార్గో సేవలపై పలు ఆరోపణలు వచ్చినప్పటికీ అధికారుల తీరు మాత్రం మారడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించి, వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story