Addanki: ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు!
Addanki: మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు.
Addanki: ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు!
Addanki: అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. నామినేషన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం, హెల్ప్ డెస్క్, నామినేషన్ పత్రాల జారీ విభాగాలను తనిఖీ చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఎన్నికల అధికారులు, పోలీసులకు పలు సూచనలు చేశారు.
జిల్లాలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలను స్వయంగా జిల్లా ఎస్పీతో కలెక్టర్ గా తాను సందర్శిస్తూ, ఎప్పటికప్పుడు పరిస్థితులపై సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు, ముండ్లమూరు, దర్శి తదితర ప్రాంతాల్లో పర్యటించినట్లు వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే తనకు, రిటర్నింగ్ అధికారులకు లేదా పోలీసులకు నేరుగా ఫోను ద్వారా తెలియజేయాలని ప్రజలకు సూచించారు. ఇందుకు సంబంధించిన ఫోన్ నంబర్లను కూడా అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు.




