Rayavaram: కేజీబీవీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విద్యార్థులకు స్వయంగా పాఠాలు!
Rayavaram: మార్కాపురం మండలం రాయవరం కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు స్వయంగా సౌర కుటుంబంపై పాఠాలు బోధించి ఉత్సాహం నింపారు.
Rayavaram: కేజీబీవీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ విద్యార్థులకు స్వయంగా పాఠాలు!
Rayavaram: మార్కాపురం మండలం రాయవరం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె, ప్రతి తరగతి గదిని సందర్శించి విద్యార్థినులతో ఆప్యాయంగా ముచ్చటించారు.
చదువుపైనే పూర్తి దృష్టి సారించాలని, ఉన్నత విద్యతోనే జీవితంలో మంచి అవకాశాలు లభిస్తాయని విద్యార్థినులకు సూచించారు. అనంతరం బ్లాక్‌బోర్డ్ వద్దకు వెళ్లిన కలెక్టర్ స్వయంగా పాఠాలు బోధిస్తూ సౌర కుటుంబం గురించి వివరించారు. చదువులో మెళకువలు, లక్ష్య సాధనకు అవసరమైన అంశాలను తెలియజేసి విద్యార్థినుల్లో ఉత్సాహం నింపారు.
తనిఖీలో భాగంగా పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ఆరా తీశారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.




