Prakasam: జనాల్లోకి కలెక్టర్.. సజ్జాపురం గ్రామంలో రాజబాబు పర్యటన!

Prakasam: ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు సంతమాగులూరు మండలం సజ్జాపురం గ్రామంలో సందడి చేశారు.

Kolla Singaiah, Addanki
Published on: 16 May 2026 9:10 AM IST
Prakasam
X

Prakasam: జనాల్లోకి కలెక్టర్.. సజ్జాపురం గ్రామంలో రాజబాబు పర్యటన!

ప్రకాశం జిల్లా: సంతమాగులూరు మండలం సజ్జాపురం గ్రామం శుక్రవారం రాత్రి గ్రామ సచివాలయంలో నే నిద్రించిన జిల్లా కలెక్టర్ పి రాజబాబు. శనివారం వేకువజామునే ప్రజల చెంతకు వెళ్లారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా రక్షిత త్రాగునీటి పథకం నిర్వహణపై పరిశీలించారు. గ్రామస్తులకు ఈ నీళ్లనే తాగాలని అవగాహన కల్పించారు. ఇందులోని ఖనిజాల విలువను వివరించి స్వయంగా తాగి చూపించిన కలెక్టర్ రాజాబాబు. స్థానికంగా లభిస్తున్న ప్రభుత్వ సేవలపై ఆరా తీశారు. స్మశానం కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశనిచ్చారు. ఎస్.డబ్ల్యు.పి.సి. షెడ్డులో తడి చెత్త నిర్వహణ, వర్మీ కంపోస్టు తయారీ పరిశీలన చేశారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki

Next Story