Prakasam District: గుండెపోటుతో మృతి చెందిన హోంగార్డుకు నివాళులు

Prakasam District: ప్రకాశం జిల్లా హోంగార్డు చిరంజీవి రావు గుండెపోటుతో మృతి చెందగా అధికారులు నివాళులర్పించి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 8 May 2026 4:21 PM IST
Prakasam District
X

Prakasam District

Prakasam District: ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు చిరంజీవి రావు గుండెపోటుతో మృతి చెందారు. ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో జనరల్ డ్యూటీ, బ్యాండ్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు (HG 78) చిరంజీవి రావు (55) చీమకుర్తిలోని తన స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు.

విషయం తెలుసుకున్న ఒంగోలు ఆర్‌ఐ అడ్మిన్ (ఇన్‌ఛార్జ్ హోంగార్డ్స్) కె. రమణా రెడ్డి, హోంగార్డ్ ఇన్‌స్ట్రక్టర్ జె. సర్వేశ్వరరావు చీమకుర్తిలోని మృతుని నివాసానికి చేరుకుని భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం మృతుని కుటుంబ సభ్యులకు తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam

Next Story