Dornala: ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో దోర్నాల మండలంలో ప్రథమ స్థానం
Dornala: పదవ తరగతి పరీక్షల్లో 574 మార్కులు సాధించి దోర్నాల మండల టాపర్‌గా నిలిచిన రామిశెట్టి శిరీషను ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజా బాబు, డీఈఓ రేణుక ఘనంగా సత్కరించారు.
Dornala: ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో దోర్నాల మండలంలో ప్రథమ స్థానం
దోర్నాల: పెద్ద దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతూ పదవ తరగతి పరీక్షల్లో అత్యున్నత మార్కులు 574 సాధించి పెద్ద దోర్నాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రథమ స్థానంలో నిలిచిన రామిశెట్టి శిరీష ను ఈరోజు ఒంగోలులో ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజా బాబు గారు మరియు జిల్లా విద్యాశాఖ అధికారిణి సి.వి. రేణుక గారు ప్రత్యేక అభినందనలతో సత్కరించారు. జిల్లాలోని అన్ని మండలాలకు సంబంధించినటువంటి ప్రథమ స్థాయిలో నిలిచిన విద్యార్థులకు ఈ రోజు ఒంగోలులో సన్మానం చేయడం జరిగింది.
ప్రతి విద్యార్థిని శాలువాతో సన్మానించి ప్రత్యేక జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రాన్ని అందించడం జరిగింది. వాటితో పాటుగా 2000 రూపాయల ప్రోత్సాహక నగదు బహుమతిని కూడా అందించడం జరిగింది. కార్యక్రమంలో పెద్ద దోర్నాల మండల విద్యాశాఖ అధికారులు బి మస్తాన్ నాయక్, ఎం కొండలరావు, మరియు పెద్ద దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల బయాలజీ ఉపాధ్యాయులు కోలా కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద దోర్నాల మండల స్థాయిలో పాఠశాల ప్రతిభను చాటినటువంటి రామిశెట్టి శిరీషను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి శ్యాం ప్రసన్నతాంజలి అభినందించారు.
పాఠశాల ఉపాధ్యాయులు జి.విజయ మాణిక్యం, వి. నాగమూర్తి, ఎస్.అనసూయ దేవి , షేక్. రహమత్, టి.వెంకట శివ, షేక్. అబ్దుల్ సలాం, డి పోలయ్య, కే కిరణ్ కుమార్, కే మీటే నాయక్, కే శిరీష రాణి, పి రామా నాయక్, హెచ్ రామా నాయక్, షేక్.మహబూబ్ బి, ఎంకే మహాదేవి, కే ఆవులయ్య, సుబ్బారెడ్డి, శ్రీకాంత్, రమాదేవి, కే ప్రసాద్ ఆర్ట్, ఎం అనిత వర్క్ ఎడ్యుకేషన్, ఉపాధ్యాయ తర సిబ్బంది బి సి హెచ్ శ్రీరామ్, రామ సుబ్బారెడ్డి, మధు, సౌజన్య అభినందనలు తెలుపుతూ... శుభాకాంక్షలు తెలియజేశారు.




