Peddaraveedu: పెద్దారవీడులో టీడీపీ సంచలనం: గొట్టం వెంకటలక్ష్మి గెలుపు!
Peddaraveedu: ప్రకాశం జిల్లా పెద్దారవీడులో వైసీపీ కంచుకోటను బద్దలు కొడుతూ టీడీపీ బలపరిచిన అభ్యర్థి గొట్టం వెంకటలక్ష్మి 138 ఓట్ల మెజార్టీతో ఎంపీటీసీగా సంచలన విజయం సాధించారు.
Peddaraveedu: పెద్దారవీడులో టీడీపీ సంచలనం: గొట్టం వెంకటలక్ష్మి గెలుపు!
పెద్దారవీడు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా పేరున్న పెద్దారవీడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి గొట్టం వెంకటలక్ష్మి ఘన విజయం సాధించారు. గ్రామ రాజకీయాల్లో తనదైన వ్యూహాలతో ముందుకు సాగిన టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసరెడ్డి, గొట్టం రామ నారాయణరెడ్డి తన రాజకీయ చతురతను మరోసారి నిరూపించుకున్నారు.
తన అన్న గొట్టం రఘునాథరెడ్డి సతీమణి గొట్టం వెంకటలక్ష్మిని ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలోకి దించిన గొట్టం శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పక్కా వ్యూహంతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీకి బలమైన పట్టున్న గ్రామంలో టీడీపీ అభ్యర్థిని గెలిపించడమే లక్ష్యంగా సాగిన ప్రయత్నాలు ఫలించాయి. చివరకు 138 ఓట్ల మెజార్టీతో గొట్టం వెంకటలక్ష్మి విజయం సాధించి గ్రామ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపారు.
ఈ సందర్భంగా గొట్టం రామ నారాయణరెడ్డి ,గొట్టం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు నాయకత్వంలో పెద్దారవీడు గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు.
విజయం సాధించిన గొట్టం వెంకటలక్ష్మి మాట్లాడుతూ, తనను గ్రామ ఆడబిడ్డగా భావించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన పెద్దారవీడు గ్రామ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.
తన విజయానికి సహకరించిన గొట్టం రామనారాయణరెడ్డి, గొట్టం రఘునాథరెడ్డి, వల్లూరి సుబ్బారెడ్డి, గొట్టం సత్యంరెడ్డి, అల్లు వెంకటేశ్వరరెడ్డి, గొట్టం శంకర్, జానపాటి కోటేశ్వరరావు, వాయిది ఏగేశ్వరరావుతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీకి కంచుకోటగా ఉన్న పెద్దారవీడులో టీడీపీ అభ్యర్థి విజయం సాధించడం, గొట్టం రామ నారాయణరెడ్డి, గొట్టం శ్రీనివాసరెడ్డి రాజకీయ వ్యూహాలకు దక్కిన విజయంగా స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.




