Prakasam: అర్ధరాత్రి దారుణం: అత్తను హత్య చేసి, భార్యపై కత్తితో దాడి!
Prakasam: సంతమాగులూరు మండలం ఏల్చూరులో అల్లుడు జరిపిన కత్తి దాడిలో అత్త మృతి చెందగా, భార్య తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Prakasam: అర్ధరాత్రి దారుణం: అత్తను హత్య చేసి, భార్యపై కత్తితో దాడి!
Prakasam: సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలోని జగనన్న కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య, అత్తపై అల్లుడు వసంత రాయుడు కత్తితో దాడికి పాల్పడినట్లు సమాచారం.
ఈ ఘటనలో అత్త బ్రహ్మేశ్వరమ్మను కత్తితో దాడి చేసి హత్య చేశాడు. భార్య వీరనారాయణమ్మకు తీవ్ర గాయాలు కావడంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా, కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో నరసరావుపేట ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఘటన అనంతరం అల్లుడు వసంత రాయుడు, పరారీలో ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.




