Prakasam: స్కూటీని ఢీకొన్న మృత్యుశకటం.. ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం!

Prakasam: ప్రకాశం జిల్లా అద్దంకి నల్లవాగు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 May 2026 7:17 AM IST
Prakasam
X

Prakasam: స్కూటీని ఢీకొన్న మృత్యుశకటం.. ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం!

ప్రకాశం జిల్లా: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరొకరికి గాయాలు. ప్రకాశంజిల్లా అద్దంకి నుండి రేణింగవరం వైపు వెళ్ళే రోడ్డులోని నల్లవాగు వద్ద రోడ్డు ప్రమాదం. స్కూటీని ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం. ప్రమాదంలో స్కూటీ పై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలు అయ్యాయి. మృతుడు మర్రిపూడి మండలం కెల్లంపల్లి గ్రామానికి చెందిన గోగుల ప్రవీణ్ 24/M గా గుర్తించిన పోలీసులు. గాయాలు అయిన వ్యక్తి ఎర్రగొర్ల శివప్రసాద్ 23/M ను చికిత్స నిమిత్తం 108 లో అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలింపు. మృత దేహాన్ని అద్దంకి (మార్చూరి) ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని , ప్రమాద తీరును పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story