Dornala: అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి.. హత్య కోణంలో దర్యాప్తు

Dornala: ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల వెలిగొండ ప్రాజెక్టు గెస్ట్ హౌస్ సమీపంలో గొట్టిపడియ గ్రామానికి చెందిన యువకుడు నాగరాజు అనుమానాస్పద మృతి.

Srikanth Singam, Markapur
Published on: 26 Jun 2026 11:41 AM IST
Dornala
X

Dornala: అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి.. హత్య కోణంలో దర్యాప్తు

Dornala: పెద్ద దోర్నాల మండల పరిధిలోని వెలిగొండ ప్రాజెక్టు అతిథి గృహం సమీపంలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం, పెద్దారవీడు మండలం గొట్టిపడియ గ్రామానికి చెందిన కొర్రప్రోలు నాగరాజు (23), తండ్రి సాల్మన్, తీవ్ర గాయాలతో మృతిచెందిన స్థితిలో కనిపించాడు. సమాచారం అందుకున్న ఎర్రగొండపాలెం సీఐ అజయ్ కుమార్, దోర్నాల ఎస్సైలు దేవకుమార్, వెంకటరమణయ్యలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం సీఐ అజయ్ కుమార్ మాట్లాడుతూ, నాగరాజు చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ జీవనం సాగించేవాడని స్థానికులు తెలిపారని చెప్పారు. దొంగతనాల నేపథ్యంలో ఏమైనా వివాదాలు ఏర్పడి ఈ ఘటన చోటుచేసుకుందా అనే కోణంతో పాటు ఇతర అన్ని కోణాల్లోనూ విచారణ చేపడుతున్నామని తెలిపారు.

పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తులో లభించే ఆధారాల ఆధారంగా మృతికి గల అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story