Markapuram: మార్కాపురంలో స్పెషల్‌గా వైసీపీ మున్సిపల్ ప్రచారం!
Markapuram: మార్కాపురం మున్సిపల్ ఎన్నికల బరిలో వైఎస్సార్‌సీపీ ప్రచారంలో దూకుడు పెంచింది. చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సి. కనకదుర్గతో కలిసి అన్నా రాంబాబు విస్తృతంగా ప్రచారం చేశారు.
Markapuram: మార్కాపురంలో స్పెషల్‌గా వైసీపీ మున్సిపల్ ప్రచారం!
మార్కాపురం: మార్కాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ దూకుడు పెంచింది. మార్కాపురం పట్టణంలోని తూర్పు వీధి నుంచి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా రాంబాబు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సి. కనకదుర్గతో పాటు వార్డు కౌన్సిలర్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో అన్నా రాంబాబు తనయుడు అన్నా కృష్ణ చైతన్య పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలు భారీగా పాల్గొనడంతో తూర్పు వీధిలో ఎన్నికల ప్రచారం సందడిగా సాగింది.




