Santhanuthalapadu: మైనంపాడులో వికసిత్ భారత్ వైద్య శిబిరం
Santhanuthalapadu: సంతనూతలపాడు మండలం మైనంపాడులో నిర్వహించిన మెడికల్ క్యాంపు. ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ కోసం ఇంటింటికీ వైద్య సేవలు.
Santhanuthalapadu: మైనంపాడులో వికసిత్ భారత్ వైద్య శిబిరం
సంతనూతలపాడు: సంతనూతల మండలం మైనంపాడు లో ఈరోజు వికసితభారత్ - స్వర్ణ ఆంధ్ర ప్రదేశ్ 2047 లో భాగముగా సేవ సంకల్ప అభియాన్ ప్రోగ్రామ్ కింద సంతనూతలపాడు మండలం మైనంపాడు గ్రామంలోని ఎస్టీ కాలనీలో శుక్రవారం నాడు సంతనూతలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు.
ఈనెల 17 నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు ప్రతి ఇంటికి ఆరోగ్య సేవలు - ప్రతి కుటుంబానికి భరోసా కల్పించాలని సంకల్పంతో ఆరోగ్యవంతమైన కుటుంబం ఆరోగ్యవంతమైన ఆంధ్ర ప్రదేశ్ కోసం మనమంతా కలిసే ముందుకు సాగుదాం అంటూ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సి హెచ్ ఓ. సిహెచ్. మాధవరావు , , ఎం..ఎల్. హెచ్ పి. అనూష , పీ.హెచ్.ఎన్. ప్రభావతి ,mphs(f) కె.వి ప్రభావతి , ANM కోటిలింగమ్మ, mpha(m) బ్రహ్మయ్య మరియు ఆశాలు వర్కర్స్ పాల్గొన్నారు.




