Prakasam: బల్లికురవ ఎస్ఎల్ గుడిపాడు అభివృద్ధి పనుల ప్రారంభం!
Prakasam: బల్లికురవ ఎస్.ఎల్. గుడిపాడులో సీసీ రోడ్లు, వాటర్ ప్లాంట్లు ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రజావేదికలో సమస్యల స్వీకరణ.
Prakasam: బల్లికురవ ఎస్ఎల్ గుడిపాడు అభివృద్ధి పనుల ప్రారంభం!
Prakasam: బల్లికురవ మండలం యస్.యల్ గుడిపాడు గ్రామంలో రెండేళ్ల పాలన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు.ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు మంత్రి వివరించారు.అనంతరం రూ. 40 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు ,సైడ్ డ్రెయిన్స్ మరియు గ్రామంలో నూతనంగా నిర్మించిన గోకులం షెడ్డును, దాతల సహకారంతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు.అనంతరం ప్రజావేదిక నిర్వహించి ప్రజల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.ప్రజల నుంచి వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
Next Story




