Peddaraveedu: బీ.చెర్లోపల్లెలో టీడీపీ జెండా: కర్ర రమాదేవి ఘన విజయం!
Peddaraveedu: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం బీ.చెర్లోపల్లె ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థిని కర్ర రమాదేవి 191 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి, 30 ఏళ్ల వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టారు.
Peddaraveedu: బీ.చెర్లోపల్లెలో టీడీపీ జెండా: కర్ర రమాదేవి ఘన విజయం!
పెద్దారవీడు: పెద్దారవీడు మండలం బీ. చెర్లోపల్లె ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కర్ర రమాదేవి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 191 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. గత 30 ఏళ్లుగా వైసీపీకి కంచుకోటగా ఉన్న బీ. చెర్లోపల్లె ఎంపీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. విజయం సాధించిన కర్ర రమాదేవి, ఆమె భర్త శ్రీకాంత్ రెడ్డిని గ్రామ బస్టాండ్ నుంచి ఇంటి వరకు భారీ ర్యాలీగా తీసుకెళ్లారు.
బాణసంచా, నినాదాలు, కార్యకర్తల కేరింతలతో గ్రామంలో విజయోత్సవ సందడి నెలకొంది. ఈ విజయానికి కృషి చేసిన టీడీపీ నాయకులు బొచ్చు వెంకటేశ్వరరెడ్డి, గంటన గుర్రప్ప గౌడ్, కాసు శ్రీనివాసరెడ్డి, మూడమంచు కొండ గురవయ్య, కంచర్ల తిరుపాల్ గౌడ్, నంద్యాల సుబ్బారెడ్డి, బద్విటి సుబ్రహ్మణ్యం, మూడమంచు వలరాజు, ఏరువ సుబ్బారెడ్డి తదితరులకు కార్యకర్తలు అభినందనలు తెలిపారు.




