Santhanuthalapadu: మాచవరంలో ఘనంగా పోషణ మాసోత్సవ వేడుకలు

Santhanuthalapadu: సంతనూతలపాడు మండలం మాచవరం అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసోత్సవాలు. పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారంపై తల్లులకు అవగాహన.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 18 Sept 2026 4:21 PM IST
Santhanuthalapadu
X

Santhanuthalapadu: మాచవరంలో ఘనంగా పోషణ మాసోత్సవ వేడుకలు

సంతనూతలపాడు: సంతనూతలపాడు మండలం మద్దులూరు పంచాయతీ పరిధిలోని మాచవరం అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం నాడు ఘనంగా పోషణ మా సోత్సవ వేడుకలు నిర్వహించారు.

0-5 సంవత్సరాలు లోపు గల పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో అందించే ఆటపాటలతో విద్య, పోషణ ఆహారం, ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తదితర వాటిపై తల్లులకు ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్. సూపర్వైజర్ బి నగరాజా, అంగన్వాడీ టీచర్లు అంజలి, అనురాధ, మాధవి, సౌజన్య, లు ఏ.ఎన్.ఎం. శిరీష, ఆశ వర్కర్లు, తల్లులు, తదితరులు పాల్గొన్నారు.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam