Prakasam: గణేష్ ఉత్సవాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఎస్పీ!
Prakasam: గణేష్ ఉత్సవాల్లో నిబంధనలు దాటితే కఠిన చర్యలు. సింగిల్ విండో ద్వారా ఉచిత అనుమతులు పొందాలని ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పష్టం చేశారు.
Prakasam: గణేష్ ఉత్సవాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఎస్పీ!
ప్రకాశం జిల్లా: వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించాలని ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు పోలీసు అధికారులను ఆదేశించారు. మండపాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను ganeshutsav.net ద్వారా సింగిల్ విండో విధానంలో ఉచితంగా పొందవచ్చని తెలిపారు.
నిమజ్జన ప్రదేశాల్లో విద్యుత్, గజ ఈతగాళ్లు, వైద్య సిబ్బంది, అగ్నిమాపక పరికరాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, రాత్రివేళ భద్రతా సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు.
స్పీకర్లను ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలని, అనుమతి లేని డీజేలు, అధిక శబ్ద వాయిద్యాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. రోడ్లపై మండపాలు, బ్యానర్లు ఏర్పాటు చేసి రాకపోకలకు ఇబ్బంది కలిగించరాదన్నారు. బాణసంచా వినియోగించకూడదని, ఊరేగింపు, నిమజ్జన సమయంలో పోలీసులు సూచించిన మార్గాలు, సమయాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, నిర్ధారణ లేని వార్తలను నమ్మవద్దని ఎస్పీ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్–112 లేదా పోలీస్ వాట్సాప్ నంబర్ 9121102266ను సంప్రదించాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణేశ్ విగ్రహాలను మాత్రమే ప్రతిష్ఠించాలని నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు.




