Racharla: గుడిమెట్టలో బైవోల్టిన్ పట్టుసాగుపై రైతుల అవగాహన సదస్సు

Racharla: రాచర్ల మండలం గుడిమెట్ట రైతు సేవా కేంద్రంలో బైవోల్టిన్ పట్టుసాగుపై రైతులకు అవగాహన. సబ్సిడీ వివరాలు వెల్లడించిన పట్టుపరిశ్రమ శాఖ అధికారులు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 12 Aug 2026 7:15 PM IST
Racharla
X

Racharla: గుడిమెట్టలో బైవోల్టిన్ పట్టుసాగుపై రైతుల అవగాహన సదస్సు

రాచర్ల: కేంద్ర పట్టు మండలి వారి నా పట్టు నా అభిమానం 2.0 అనే కార్యక్రమం లో భాగంగా, డా. జాయిసీ రాణి, సైంటిస్ట్-డి, CSR&TI మరియు పట్టుపరిశ్రమ శాఖ సహాయక అధికారి ఐ. శ్రీధర్ వారి ఆధ్వర్యంలో రైతులకు అవగాహన రాచర్ల మండలం గుడిమెట్ట గ్రామ రైతు సేవా కేంద్రంలో బైవోల్టిన్ పట్టుసాగుపై రైతులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో CSR&TI శాస్త్రవేత్తలు డాక్టర్ జాయిసి రాణి, మల్బరీ సాగు మరియు పట్టుపురుగుల పెంపకంలోని సాంకేతికత ఏవిధముగా వినియోగించు కోవాలి దాని ద్వారా మంచి పంట దిగుమతులు ఏవిధముగా పొందాలి అనే విషయాలను తెలియజేసారు.

పట్టుపరిశ్రమ శాఖ సహాయక అధికారి ఐ. శ్రీధర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్నటువంటి ఎల్-నినో పరిస్థితుల్లో నీటిని డ్రిప్పు ద్వారా పొదుపుగా వాడుకోవాలని కోరారు.

అలాగే Low Cost sheds కట్టుకోవాలని, అందుకోసం ప్రభుత్వం అందచేస్తున్న రూ.2.25 లక్షల సబ్సిడీని మరియు ఎకరా మల్బరీ తోట పెంచడానికి జనరల్ వారికీ రూ.33,750 ఉపయోగించుకోవాలని అలాగే ప్రస్తుతం మార్కెట్ లో మల్బరీ పంటకు ఉన్న ఆదరణ, గిట్టుబాటు ధరలు, పంట ద్వారా ఏవిధమైన లాభాలు వస్తున్నాయి మొదలైన అనే విషయాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టు పరిశ్రమ సహాయ అధికారి ఐ. శ్రీధర్ శాస్త్రవేత్తలు డాక్టర్ జాయిసి రాణి మరియు RSK సిబ్బంది మరియు పట్టు పరిశ్రమ శాఖ సిబ్బంది TA లు, FA లు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story