Racherla: రాచర్లలో స్పందన విద్యార్థుల భారీ దేశభక్తి ర్యాలీ
Racherla: ప్రకాశం జిల్లా రాచర్ల స్పందన విద్యాసంస్థలలో 80వ స్వాతంత్ర వేడుకలు. 100 అడుగుల జాతీయ జెండాతో 1050 మంది విద్యార్థుల భారీ ర్యాలీ, పిరమిడ్ విన్యాసాలు.
Racherla: రాచర్లలో స్పందన విద్యార్థుల భారీ దేశభక్తి ర్యాలీ
రాచర్ల: గిద్దలూరు నియోజకవర్గం లోని రాచర్ల మండల కేంద్రంలోనీ స్పందన విద్యాసంస్థలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించి. జాతీయ గీతాన్ని ఆలపించారు. విద్యార్థులు దేశభక్తిని చాటే సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలతో ఆకట్టుకున్నారు.
అనంతరం రాచర్ల గ్రామంలో 100 అడుగుల భారీ జాతీయ జెండాతో సుమారు 1050 మంది విద్యార్థులతో దేశభక్తి ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు జాతీయ జెండాలను చేతబట్టి, దేశభక్తి నినాదాలతో ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ర్యాలీలో విద్యార్థులచే పిరమిడ్ విన్యాసాలు ప్రదర్శించగా అవి గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అలాగే స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థుల్లో దేశభక్తి, క్రీడా స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే ఇటువంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యమని పాఠశాల యాజమాన్యం తెలిపింది
ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.




