Markapuram: మార్కాపురంలో ఆర్‌బీఎస్‌కే '4D' ఉచిత వైద్య శిబిరం

Markapuram: మార్కాపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్‌బీఎస్‌కే సెంటర్ ద్వారా చిన్నారుల్లో 4D లోపాలకు ఉచిత చికిత్సలు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 25 July 2026 7:16 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురంలో ఆర్‌బీఎస్‌కే '4D' ఉచిత వైద్య శిబిరం

Markapuram: మార్కాపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆర్‌బీఎస్‌కే (RBSK) ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ద్వారా చిన్నారుల్లో కనిపించే 4D కండిషన్స్ (పుట్టుకతో వచ్చే లోపాలు, వ్యాధులు, పోషకాహార లోపాలు, అభివృద్ధి లోపాలు) గుర్తించి, అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆర్‌బీఎస్‌కే బృందం వెల్లడించింది.

మార్కాపురం జిల్లా ఎన్‌క్యాచ్‌మెంట్ పరిధిలోని అన్ని పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్లు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది తమ పరిధిలో గుర్తించే 4D కండిషన్స్ ఉన్న చిన్నారులను వెంటనే మార్కాపురం జిల్లా ఆసుపత్రిలోని ఆర్‌బీఎస్‌కే కేంద్రానికి రిఫర్ చేయాలని కోరారు.

ఈ సందర్భంగా ఆర్‌బీఎస్‌కే డీఈసీ/పీవో చంద్రశేఖర్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హెబ్సిబా, డెంటల్ డాక్టర్ డాక్టర్ శ్రీహరి రెడ్డి, సైకాలజిస్ట్ సుబ్బారావు, ఫిజియోథెరపిస్ట్ యశ్వంత్ బాబు, ఆప్టోమెట్రిస్ట్ శ్రీరామ్ నాయక్, సోషల్ వర్కర్ చాంద్ బేగం, స్టాఫ్ నర్సులు మేరీ సుగుణ మరియు సుందరి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

అలాగే, త్వరలోనే పీడియాట్రిషన్, ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్ తదితర ఎర్లీ ఇంటర్వెన్షన్ పోస్టులు కూడా భర్తీ కానున్నాయని పేర్కొన్నారు.

లోపాలు ఉన్న చిన్నారులు వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మార్కాపురం జిల్లా ఆసుపత్రిలోనే సమగ్ర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్‌బీఎస్‌కే యూనిట్ సభ్యులు విజ్ఞప్తి.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story