Prakasam: ప్రకాశంలో విషాదం.. లారీని ఢీకొన్న ఆటో, ఇద్దరు దుర్మరణం!
Prakasam: ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం వెల్లల చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
Prakasam: ప్రకాశంలో విషాదం.. లారీని ఢీకొన్న ఆటో, ఇద్దరు దుర్మరణం!
Prakasam: ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం వెల్లల చెరువు - కామేపల్లి గ్రామాల మధ్య అనగా వినుకొండ టు నరసరావుపేట హైవే పై వీర హనుమాన్ గ్రానైట్ ఫ్యాక్టరీ ముందు రోడ్డు ప్రమాదం జరిగింది.
ఫ్యాక్టరీలో నుండి బయటకు వస్తున్న లారీని ఆటో ఢీ కొని ప్రమాదం చోటు చేసుకుంది. వినుకొండ మండలం వేల్పూరు గ్రామానికి చెందిన 9 మంది ఆటోలో నరసరావుపేటలో పెద్దకర్మకు వెళ్లే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఇద్దరు వినుకొండ మండలం వేల్పూరు గ్రామానికి చెందిన దావులూరి ఏడుకొండలు 50/M , ముండ్రు రవణమ్మ 52/W గా గుర్తింపు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story




