Prakasam: పాత మల్లాయపాలెంలో వైసీపీకి షాక్: టీడీపీలోకి చేరికలు!

Prakasam: ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పాత మల్లాయపాలెంకు చెందిన 30 వైఎస్సార్‌సీపీ కుటుంబాలు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమక్షంలో టీడీపీలో చేరాయి.

Kolla Singaiah, Addanki
Published on: 25 Oct 2026 9:50 PM IST
Prakasam
X

Prakasam: పాత మల్లాయపాలెంలో వైసీపీకి షాక్: టీడీపీలోకి చేరికలు!

ప్రకాశం: ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పాత మల్లాయపాలెం గ్రామానికి చెందిన వైసీపీకి చెందిన 30 కుటుంబాలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు సంతమాగులూరు మంత్రి క్యాంపు కార్యాలయంలోని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.

మంత్రి గొట్టిపాటి రవికుమార్ నాయకత్వంపై నమ్మకంతో పాటు, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా పార్టీ నాయకులు పేర్కొన్నారు.

పాత మల్లాయపాలెం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు టీడీపీలో చేరడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki